సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (13:04 IST)

ఆ సినిమా నా కిష్టంలేదు, కానీ త‌ప్ప‌ట్లేదుః నాగ్‌

Nagarjuna still
లాక్‌డౌన్ త‌ర్వాత తెలుగు సినిమాలు ఒక్కోటి గేట్లు తెరుచుకున్న‌ట్లు బ‌య‌ట‌ల‌కు వ‌స్తున్నాయి. చిన్న సినిమాలు ఇందులో ముందున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ అయినా చిన్న సినిమాల‌కూ అంతో ఇంతో స్పేస్ ఇస్తున్నారు పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్లు. దాంతో ఒకేవారంలో 5,6 సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఎన్ని ఆడుతున్నాయ‌నేది ప‌క్క‌న పెడితే కొన్ని రిలీజ్ చేశామ‌ని అనిపించుకుంటున్నాయి. ఇక ఈ వారం అంటే ఏప్రిల్ 2న ప్ర‌త్యేక ప‌రిస్థితి నెల‌కొంది.

నాగార్జున సినిమా `వైల్డ్ డాగ్‌` సినిమా విడుద‌ల‌కాబోతుంది. అదేరోజు కార్తీ సినిమా `సుల్తాన్‌`కూడా విడుద‌ల‌కాబోతుంది. ఇది డ‌బ్బింగ్ సినిమా. ఈ సినిమా విడుద‌ల‌కు పెద్ద‌గా ప‌బ్ల‌సిటీ చేయ‌డంలేదు నిర్మాత‌లు. ఎందుకంటే తెలుగులో నాగార్జున సినిమా వుంది క‌నుక వాయిదా వేసుకోవాల‌ని చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలిసింది. కానీ త‌మిళ నిర్మాత‌లు, కార్తీ కూడా సమ్మ‌తించిన‌ట్లు లేదు. అందుకే నాగార్జున త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. కార్తీ మంచి స్నేహితుడు. ఆయ‌నంటే చాలా ఇష్టం. ఊపిరి సినిమా నాతో చేశాడు. కానీ నా సినిమా రోజే కార్తీ సినిమా విడుద‌ల కావ‌డం ఇష్టంలేదు. కానీ త‌ప్ప‌లేదు. అందుకే మా ఇద్ద‌రి సినిమాలు కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. సో. నాగార్జున మ‌న్సులోని మాట అద‌న్న‌మాట‌. అయినా ఈరోజే కార్తీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్నాడు. ఆయ‌న ఏమంటాడో కొద్ది నిముషాల్లో చూద్దాం