ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (11:09 IST)

'భరత్ అనే నేను'... ఐ డోంట్ నో అంటున్నాడు... (Audio Song)

ప్రిన్స్ మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". కైరా అద్వాణీ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మి

ప్రిన్స్ మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". కైరా అద్వాణీ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మహేశ్‌బాబు ఇందులో ముఖ్యమంత్రిగా సందడి చేయనున్నారు.
 
ఏప్రిల్‌ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన టీజర్‌ (భరత్‌ విజన్)కు, టైటిల్‌ పాటకు విశేషమైన స్పందన లభించింది. అత్యధిక లైక్స్‌ లభించిన టీజర్‌గా రికార్డు కూడా సృష్టించింది.
 
అయితే ఈ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులోని రెండో పాట 'ఐ డోంట్‌‌ నో' అనే లిరికల్‌ పాటను విడుదల చేశారు. ఈ పాటను బాలీవుడ్‌ నటుడు, గాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ పాడటం విశేషం. 
 
'యూనివర్స్‌ అనే ఎన్‌సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో..' అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే ట్విటర్‌ ట్రెండింగ్‌లో టాప్‌ స్థానంలో ఉంది ఈ పాట.