బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (18:06 IST)

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

GV Prakash Kumar
GV Prakash Kumar
మట్కా సినిమా నేను చూశాను. ఇది నైస్ యాక్షన్ ఫిల్మ్. అద్భుతమైన డైరెక్షన్, స్టొరీ, పెర్ఫార్మెన్స్ లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వరుణ్ తేజ్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కచ్చితంగా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ అన్నారు.
 
వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
 అమరన్, లక్కీ భాస్కర్, ఇప్పుడు మట్కా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం  చాలా హ్యాపీగా వుంది. దీపావళికి వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా వుంది. మట్కా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకం వుంది.
 
-మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ గారికి అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ వుంది. ఆయనకి ఉన్న డార్క్ ఫిలిం మేకింగ్ స్టయిల్ బ్రిలియంట్. మట్కా చాలా మంచి స్క్రిప్ట్. నాకు చాలా నచ్చింది. మట్కా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది.
 
-నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్ కి ఉంటుంది. తర్వాత డైరెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాను. తను ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు? తన ఫిల్ మేకింగ్ స్టైల్ ఏమిటి, విజువల్ గా కథని ఎలా తీస్తారనేది కూడా చూస్తాను.
 
-కరుణ్ కుమార్ గారు స్క్రిప్ట్ పరంగా, విజువల్ గా, టెక్నికల్ గా చాలా అద్భుతమైన డైరెక్టర్. చాలా హై బడ్జెట్ తో ఈ సినిమా గ్రాండ్ గా తీశారు. లక్కీ భాస్కర్, అమరన్ లానే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.  
 
- మట్కా ఇది పిరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా పిరియాడికల్ గానే ఉండాలి. ఆడియన్స్ ని ఆ టైమ్స్ లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మోడరన్ సింథ్స్ వాడడం కుదరదు. పిరియాడిక్ టోన్ ని క్రియేట్ చేయడానికి ఆ తరహా మ్యూజిక్ ని సృష్టించాలి. ఆ టైమ్ పీరియడ్ కి ఆడియన్స్ ని మళ్లీ తీసుకురావాలంటే అలాంటి మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయాలి. అది నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది. మట్కా గ్యాంగ్ స్టర్ ఫిలిం. వైలెన్స్, యాక్షన్, హై ఎమోషన్ వుంటుంది. ఇది గాడ్ ఫాదర్ తరహా సినిమా.
 
- యాక్టర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉంటున్నా. అందుకే నెలలో 12 రోజులు షూట్ చేస్తాను. మిగతా రోజులన్నీ మ్యూజిక్ లోనే ఉంటాను. రెండు నెలల ముందే షెడ్యూల్ చేసుకుంటాను. అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. మ్యూజిక్ విషయంలో అన్ టైం ఉంటాను. నా వర్క్ ని టైంకి డెలివర్ చేస్తాను, నేను ఎప్పుడూ లాస్ట్ మినిట్ వర్క్ చేయను. వారం రోజులు ముందుగానే అవుట్ ఫుట్ ఇచ్చేస్తాను. అందుకే నిర్మాతలు నాతో వర్క్ చేయడానికి హ్యాపీగా ఉంటారు.
 
- మ్యూజిక్ యాక్టింగ్ రెండిటిని సమానంగా ఆస్వాదిస్తాను. ఈ రెండిట్లోనూ లెర్నర్ గానే ఫీలవుతాను. ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతిరోజు ఒక విద్యార్థిగానే భావిస్తాను.
 
-మ్యూజిక్ అనేది ఒక సముద్రం లాంటిది. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సినిమా మనకి ఏదో కొత్త విషయాన్ని నేర్పుతుంది. అందుకే ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాను.  
 
- నా 100 సినిమాల జర్నీ నిజంగా  గ్రేట్ జర్నీ. దేవుడి దయగా భావిస్తాను. యుగానికి ఒక్కడు, మద్రాస్ పట్నం, ఆకాశమే నీ హద్దురా, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇలా ఎన్నో జోనర్స్ లో సినిమాలు చేశాను. చాలా టైం లెస్ క్లాసిక్ సాంగ్స్ వచ్చాయి. ఈ జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రతిసారి ఆడియన్స్ ని అలరించడానికి నా వంతు కృషి చేస్తాను.
 
-నిజానికి 'దసరా'లో ఒక క్యారెక్టర్ నేను చేయాల్సింది. కానీ నా డేట్స్ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్ వుంటే డెఫినెట్ గా చేస్తాను.
 
-నాకు లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం. మంచి పాటలు చేయడానికి ఆ జోనర్ చాలా బాగుంటుంది. సెల్వ రాఘవన్ గారితో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను.