శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (15:33 IST)

హాస్టల్‌ లైఫ్‌ మిస్‌ అయ్యా, అందుకే మా ఇల్లే హాస్టల్ చేశా : సుప్రియ యార్లగడ్డ

Supriya Yarlagadda
Supriya Yarlagadda
విద్యార్థులంతా హాస్టల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. కానీ కాలేజీ హాస్టల్‌లో చదివేవారి అనుభవాలు చూశాక ఆ వయస్సులో అది కూడా ఓ భాగమైతే బాగుటుందనిపిస్తుంది. బాయ్స్‌ హాస్టల్‌ లైఫ్‌ బాగుంటుంది. అక్కడేదో ఎంజాయ్‌ చేస్తున్నారని గాళ్స్‌ అనుకుంటారట. కాలేజీకి వచ్చాక అక్కడ విషయాలు చెప్పుకుని సరదా పడుతుంటారు. ఈ విషయంలో ఇటీవలే రష్మి గౌతమ్‌ కూడా తాను హాస్టల్‌ లైఫ్‌ మిస్‌ అయ్యాయని వెల్లడించింది. తాజాగా ఇదే అభిప్రాయాన్ని నటి, అన్నపూర్టస్టూడియో సి.ఇ.ఓ. సుప్రియ యార్లగడ్డ వ్యక్తం చేశారు.
 
కన్నడ సినిమా బాయ్స్‌ హాస్టల్‌ సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేస,  చాయ్‌ బిస్కట్‌ బేనర్‌తో కలిసి ఈనెల 25న విడుదలచేయనున్న ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. హాస్టల్‌ లైఫ్‌ మిస్‌ అయ్యారా! అని ప్రశ్నిస్తే.. ఒకరకంగా మిస్‌ అయ్యాను అనిపించింది. చెన్నైలో నేను కాలేజీ చదివే రోజుల్లో చాలామంది హాస్టల్‌లో గాళ్స్‌ వుండేవారు. వారు  వచ్చి అక్కడ విషయాలు చెబుతుంటే చాలా ఎగైట్‌మెంట్‌ కలిగేది. అందుకే ఓసారి హాస్టల్‌లో భోజనానికి వెళ్ళాను. అంతే ఆ భోజనం తినలేక వచ్చేశాను. పాపం. వీళ్ళు రోజు ఇలానే తింటున్నారనిపించింది. ఆమ్లెట్‌ తో బోజనం చేయాలంటే ధర పెరుగుతుంది. కాయన్‌ కు ఒకవైపు బాగున్నట్లే మరోవైపు మరో కోణం కూడా వుంది. దాంతో హాయిగా నాన్నగారు నాకు ఓ బిల్డింగ్‌ కాలేజీ పక్కనే ఇచ్చారు అని గాళ్స్‌కు చెప్పాను. ఆ తర్వాత నా ఇల్లే హాస్టల్‌ అయింది. అంటే ఆ గాళ్స్‌ అంతా నా దగ్గరకు వచ్చేశారు. అంటూ సరదా విషయలు చెప్పారు.
 
ఇక బాయ్స్‌ హాస్టల్‌లో వందమందికిపైగా కొత్త వారు నటించారు. వారి వాయిస్‌లను డబ్బింగ్‌ చెప్పడానికి 6 డబ్బింగ్‌ స్టూడియోలను 70మందికిపైగా డబ్బింగ్‌ ఆర్టిస్టులతో చెప్పించి నాచురల్‌గా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఇలాంటి సినిమాను రీమేక్‌ చేయడం కత్తిమీదసామే అని అన్నారు. అందుకే డబ్‌ చేశామన్నారు.