శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (10:55 IST)

చావు అంచుల వరకు వెళ్లివచ్చాం... : హీరోయిన్ సురభి

surabhi
తనతో పాటు అనేక మంది ప్రయాణికులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చామని హీరోయిన్ సురభి అంటున్నారు. బీరువా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌లలో పాటు పలు చిత్రాల్లో నటించారు. తాజాగా తనకు ఎదురైన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ, తాను చావు నుంచి తృటిలో తప్పించుకున్నట్టు చెప్పారు. ఇదివరకెన్నడూ ఎదురుకాని ఒక ఘటన ఆదివారం ఎదురైందన్నారు. తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై, ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. విమానం పైలెట్ నియంత్రణలో లేకుండా పోయిందని, ఆ సమయంలో బాగా వేసిందని ఆమె చెప్పారు. అయితే, పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా అంతా ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డామని తెలిపారు. 
 
చావు అంచుల వరకు వెళ్లొచ్చామనే భావన ప్రతి ఒక్కరికీ కలిగిందన్నారు. ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. తాను ఈ రోజు ఇలా బతికుండటంతో తనలోని సానుకూల దృక్పథం పట్ల మరింత నమ్మకం కలిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఏ విమానం, ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.