శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (12:45 IST)

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఎప్పటి నుంచో ప్రారంభం అవుతుందో తెలుసా?

Bunny_Allu Arjun
Bunny_Allu Arjun
సోషల్ మీడియాలో ప్రముఖ దర్శకుడు అట్లీ తదుపరి సినిమాకు సంబంధించిన వార్త ట్రెండ్ అవుతోంది. అట్లీ భార్య, ప్రియా అట్లీ షేర్ చేసిన రీల్ ద్వారా ఈ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
 
ఏప్రిల్ 8, 2024న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ- అల్లు అర్జున్ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడు. ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ చిత్రీకరణలో బన్నీ బిజీగా వున్నాడు.