అల్లు అర్జున్- ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్- ప్రభాస్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో మాటలవరకే పరిమితమైన అభిమానులు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకరినొకరు కొట్టుకోవటం వరకు దారి తీసింది.
బెంగళూరులో ఇలా అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ దాడికి పాల్పడటం సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. దీంతో ప్రభాస్, అల్లు అర్జున్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభాస్ సినిమా 'కల్కి 2898ఎడి' విడుదలకి సిద్ధం అవుతుండగా, అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ కోసమని నిన్న విశాఖపట్నం వెళ్లారు. ఈ నటుల అభిమానులు కొట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.