శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (12:59 IST)

ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాలో మృణాల్ ఠాకూర్‌

mrunal thakur
ప్రభాస్ త్వరలో హను రాఘవపూడితో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం యుద్ధ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
ప్రభాస్ తన ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. హను స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సీతా రామం లాంటి సూపర్ హిట్ తర్వాత హను తన టీమ్‌ని రిపీట్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. 
 
ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్‌ను రొమాన్స్ చేయడానికి మృణాల్ ఠాకూర్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పక్కన మృణాల్ పక్కాగా మ్యాచ్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. 
 
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, 2025 ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిచాలనుకుంటున్నట్లు టాక్.