శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (14:16 IST)

బైక్ ర్యాలితో అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌

allu arjun at vyzag
allu arjun at vyzag
పుష్ప చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట విశ్వ‌రూపంకు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఈ చిత్రంతో ఆయ‌న‌కు ల‌భించిన పాపులారిటీతో  ప్ర‌పంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తార‌స‌ప‌డ‌తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు అభిమానుల చేత గ్రాండ్ వెల‌క‌మ్ ల‌భిస్తుంది. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రుగుతుంది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మాత‌లు. 
 
allu arjun at vyzag
allu arjun at vyzag
కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. అత్యంత కీల‌కంగా భావించే ఈ షెడ్యూల్‌లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి అభిమానులు బైక్  ర్యాలిగా బ‌య‌లుదేరి త‌మ అభిమాన హీరో క‌నివినీ ఎరుగ‌ని వెల్‌క‌మ్ చెప్పారు. దారి పొడ‌వున పూల‌వ‌ర్షం కురిపించారు. అభిమానులు ఆప్యాయత‌ను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు.