ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (09:09 IST)

హీరోయిన్‌గా చేయాలనివుంది... అందుకే ఆ డైరెక్టర్స్‌‍తో.. : 'మీన్ గర్ల్స్' అవంతిక

Avantika
తనకు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేయాలనివుందని 'మీన్ గర్ల్స్' అవంతిక అంటున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు వీలుగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల వంటివారిని త్వరలోనే కలుస్తానని ఆమె చెప్పారు. 'మీన్ గర్ల్స్' చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన అవంతిక.. 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే సిరీస్ ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. యూత్‌లో చాలా వేగంగా ఫాలోయింగ్‌ను కలిగిన ఆమె... తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను వెల్లడించారు. 
 
'మీన్ గర్ల్స్‌'కి వెళ్లొచ్సిన మూడు నెలల తర్వాత తనకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. దీంతో తనకు అవకాశం రాదని భావించాను. కానీ, ఓ రోజున పిలుపు రావడంతో నమ్మలేకపోయాను. ఆ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇంతవరకూ నా వయసుకు తగిన పాత్రలను పోషిస్తూ వచ్చాను. త్వరలోనే తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తాను అని చెప్పారు. 
 
ముఖ్యంగా, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, శేఖర్ కమ్ముల వంటి దర్శకుల సినిమాలు అంటే తనకు అమితమైన ఇష్టమన్నారు. త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' చిత్రంలో తాను నటించినట్టు చెప్పారు. అలాగే, మిగిలిన హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాలని ఉందన్నారు. తన కోరికను నెరవేర్చుకునేందుకు త్వరలోనే వాళ్లందరిని కలిసి అడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పారు.