గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (22:53 IST)

సొంత మనుషులే పవన్‌ను తిట్టడమా? హైపర్ ఆది భావోద్వేగం

hyper aadi
జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. జనసేన గురించి ఎక్స్ ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ఎమోషనల్ వీడియోను హైపర్ ఆది షేర్ చేశాడు. టీడీపీ, జనసేన పొత్తులో జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే పవన్‌ కల్యాణ్‌ను తిడుతున్నారు. ఆయనపై అలుగుతున్నారు. జనసేన జెండాలను తగులబెడుతున్నారు. 
 
ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. ఒకసారి ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించండని హైపర్ ఆది భావోద్వేగానికి లోనయ్యాడు. తనను నమ్ముకున్న ప్రజలను, తన వెన్నంటే వుండే నాయకులను పవన్ మోసం చేయడని, అలాంటి వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌కు వుండదని హైపర్ ఆది అన్నాడు. పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు, పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. 
 
ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను మదన పడి వుంటాడని, పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని హైపర్ ఆది కొనియాడాడు. 
pawan kalyan
 
అలాంటి వ్యక్తి గురించి శత్రువులు మాట్లాడితే సరే.. కానీ పవన్ వెంటే వున్న మనమే మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం హైపర్ ఆది సీట్ల కేటాయింపుకు సంబంధించిన పవన్‌కు మద్దతు తెలుపుతూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.