మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సబ్బులు విక్రయిస్తున్న నటి ఐశ్వర్య

aishwarya lakshmi
సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి ఇపుడు కుటుంబ పోషణ నిమిత్త సబ్బులు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పైగా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అప్పులు, ఇతర సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. తన తన కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పారు. 
 
ఇపుడు తాను, నాలుగు పిల్లులలో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నానని చెప్పారు. తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక మెగా సీరియల్‌లో నటించే అవకాశం కావాలన్నారు. బుల్లితెర నాకు అన్నం పెట్టిందని, సినిమాలు అన్నం పెట్టలేదని చెప్పారు.