శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (18:50 IST)

నా జయాపజయాలకు కారణం నేనే కావాలని భావిస్తాను : ఏజెంట్ అఖిల్

Agent, Akhil
Agent, Akhil
మా కుటుంబానికి ప్రేమకథలు బాగా నప్పుతాయి.. కానీ నేను మాత్రం మాస్ యాక్షన్ సినిమాలనే  ఇష్టపడతా. కారణం అంటే ఏం చెప్తాము. ఫలానా కలర్ ఎందుకు ఇష్టం అంటే ప్రత్యేకించి కారణాలు చెప్పలేం కదా. చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలే ఇష్టం. రాజమౌళి గారి సినిమాలు అంటే పిచ్చి అని అఖిల్ అక్కినేని అన్నారు.  ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ అక్కినేని చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
బాల నటుడిగా సిసింద్రీ అనే యాక్షన్ సినిమా చేశారు కదా ?
అప్పుడు నాకు 16 నెలలు.. అసలు ఏం గుర్తులేదు(నవ్వుతూ). ఇప్పుడు కూడా కొందరు సిసింద్రీ అని పిలుస్తారు.  
 
ఏజెంట్ జర్నీ ఎలా మొదలైయింది ?
నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది. అయితే పర్సనల్ గా నాకు ఇష్టమైన జోనర్ యాక్షన్. లాక్ డౌన్ సమయంలో ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు.. దర్శకుడు సురేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పటికి కథ ఇంకా తెలీదు. కానీ ఏదైనా కొత్తగా ఫ్రెష్ గా చేయాలని మాత్రం నిశ్చయించుకున్నాను. ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా చేసి ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్ ని ఎంపిక చేసుకొని ఏజెంట్ జర్నీ మొదలైయింది.
 
నాన్నగారు యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ ఆయన్ని మన్మధుడు అంటారు. మీ నాన్నాగారికి ఆ పేరుంది. మీరు ఏ పేరు తెచుకోవాలని అనుకుంటున్నారు?
ఇప్పటికి నా ఆలోచన దృక్పథం ఏమిటంటే.. అఖిల్ సినిమాకి థియేటర్ కి వస్తే ప్రేక్షకులకు ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. చాలా హార్డ్ వర్క్ చేసి, సినిమాకి ఏడాది రెండేళ్ళు పట్టినా.. ప్రేక్షులకు థియేటర్ లో గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రాలు చేయాలని వుంది.  
 
బాడీని ఎనాలసిస్ చేయడానికి ఎవరైనా హాలీవుడ్ యాక్షన్ హీరోల పరిశీలించారా ?
హాలీవుడ్ వరకూ ఎందుకు ..ఇండియాలోనే హృతిక్ రోషన్ ఉన్నారు. కానీ బాడీ బిల్డింగ్ లో నేను రియలైజ్ అయినది ఏమిటంటే.. ప్రతి బాడీ జెనిటిక్ డిఫరెంట్. ఒకరిలా బిల్డ్ చేద్దామని అనుకుంటే కుదరదు. దర్శకుడు ఎలాంటి లుక్ ని కోరుకుంటున్నారో దానిపై ద్రుష్టి పెట్టాను. నాలుగు నెలల్లో నేను కోరుకుంటున్న బాడీ తీసుకురాగలని అనుకున్నాను. కానీ పది నెలలు పట్టింది. ‘బాడీలో చాలా మార్పు కావాలి.  ఎక్స్ట్రీమ్   ట్రాన్స్ ఫర్మేషన్ ఇవ్వాలి. గత సినిమాల లుక్ ని ప్రేక్షకులు మర్చిపోవాలి’’ఈ పాయింట్ ని దర్శకుడు బలంగా పట్టుకున్నారు. దానికి టైం పట్టింది.
 
ఏజెంట్ చేసినప్పుడు మీ ప్రిఫరెన్స్, లిమిటేషన్స్ ఏమిటి ?
ఏజెంట్ జోనర్ నాకు బాగా నచ్చేసింది. లిమిటేషన్స్ విషయానికి వస్తే.. ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇంతకుముందు అలాంటింది చేయలేదు. ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది. ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే.. వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గరి. అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్ర అలవాటైపోయింది.
 
ఇదివరకు కొన్ని యాక్షన్ స్పై సినిమాలు వచ్చాయి. ఏజెంట్ వాటికి ఎంత భిన్నంగా కొత్తగా వుంటుంది ?
ఏజెంట్ చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్ముట్టి గారు లాంటి పెద్ద స్టార్ ని ఎందుకు ఇందులో తీసుకున్నామో విడుదల తర్వాత మీరే చెప్తారు. ఇది కేవలం ఒక్క హీరో వైపు నుంచే నడిచే సినిమా కాదు. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా జరిగే సినిమా ఇది. మమ్ముట్టి గారి పాత్రతో నేను ప్రేమలో పడిపోయాను. అంత అద్భుతంగా వచ్చింది. కథ ఓ కొత్త ప్రపంచంలో జరుగుంటుంది. కంప్లీట్ గా న్యూ సెటప్. ఖచ్చితంగా ఏజెంట్ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.
 
ఏజెంట్   సీరియస్   టోన్ లో వెళుతుందా ? తెలుగు సినిమాలకి అలవాటైన ప్యాకేజ్ ఉంటుందా ?  
స్పై జోనర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం సీరియస్ గా వెళిపోతుంది. అయితే మాస్ ఆడియన్స్ కి నచ్చేలా యంగేజింగ్ ఎంటర్ టైనింగా ఉండటానికి స్క్రిప్ట్ దశలో చాలా వర్క్ చేశాం. స్పై అనే వాడు నీడలో ఉంటూ అందరితో బ్లెండ్ అయిపోయి వుండాలి. కానీ ఏజెంట్ కంప్లీట్ రివర్స్. అన్ ప్రెడిక్ట్ వైల్డ్ మంకీలా ఉంటాడు. సెపరేట్ కామెడీ స్పై రన్ ని డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే హ్యూమర్ ని కథానాయకుడి పాత్రలోనే ఉండేట్లు చూసుకున్నాం. అది చాలా ఆసక్తికరంగా వుంటుంది. సీరియస్ యాక్షన్ సీన్ లో కూడా తను హ్యుమర్ తీసుకొచ్చేస్తాడు. క్యారెక్టర్ వైల్డ్ నెస్ వలన అది వర్క్ అవుట్ అయ్యింది. సూరి గారి పాత్రలు మాములుగా క్రాక్ గా వుంటాయి. దాని వలన సినిమా ఎక్సయిటింగా అయిపోతుంది.  సూరి గారు ఈ పాత్రని చాలా ప్రేమించి చేశారు.  
 
ఏజెంట్ లో ఊర్వశి రౌతెలా ఓ పాట చేస్తుందని విన్నాం ?
అవును. చివర్లో షూట్ చేసిన పాట అదే. క్లైమాక్స్ లో వస్తుంది.
 
సాక్షి వైద్య నటన ఎలా వుంది ?  
సాక్షి అద్భుతంగా నటించింది. చాలా ప్రొఫెషనల్ గా చాలా మంచి ఎనర్జీతో చేసింది. చూడటానికి కూడా చాలా అందంగా వుంది. మొదటి రోజు షూట్ తర్వాత సూరి గారు ‘’అమ్మాయి ఇరగదీసేస్తుంది మీరు ఎక్కడా తగ్గకండి’’ అని చెప్పారు.
 
ఏజెంట్ స్క్రిప్ట్ నాన్న గారికి చెప్పినపుడు ఎలాంటి సలహాలు ఇచ్చారు ?
నిజం చెప్పాలంటే ఏజెంట్ స్క్రిప్ట్ నాన్న గారితో షేర్ చేయలేదు. నా జపయజయాలకు నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలని భావిస్తాను. నాన్న గారి సలహాలు తీసుకుంటాను. ఆయనకి అన్ని విషయాలపై చాలా అవగాహన వుంటుంది. ఆయనకి చాలా ప్రశ్నలు అడుగుతాను. కానీ ఈ కథ చేయాలా వద్దా అనేది మాత్రం నా నిర్ణయం.
 
ఏజెంట్ ఆలస్యమవ్వడానికి కారణం ?
ఈ విషయంలో అందరికీ ఓ వివరణ ఇవ్వాలి. ఏజెంట్ సినిమాని చాలా త్వరగా అనౌన్స్ చేసేశాం. స్క్రిప్ట్ చేయడానికి మాకు ఏడాది పట్టింది. తర్వాత మా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి అనారోగ్యం చేసింది. దాదాపు మూడు నెలలు ఆయన నడవలేకపోయారు. 120 రోజుల వర్కింగ్ డేస్ వున్న ఇలాంటి భారీ స్కేల్ సినిమాకి 15 నెలలు సహజంగానే పడుతుంది. అయితే ముందుగానే అనౌన్స్ చేసేయడం వలన మూడేళ్ళు పట్టిందనే భావన కలిగింది.
 
అనిల్ సుంకర నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?
అనిల్ గారు చాలా ప్యాషనేట్, డేరింగ్ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్. అలాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తాను.