ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (22:37 IST)

ఇలా చేస్తే పుష్ప షూటింగ్ చూపిస్తాం : బన్నీవాసు

Kiran Abbavaram, Kashmir
Kiran Abbavaram, Kashmir
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన  "వాసవసుహాస" పాటకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ చిత్రం సెకండ్  సింగిల్ ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో  మ్యాచ్ నిర్వహించి. ఆ మ్యాచ్ లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ తో "ఓ బంగారం" అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ మ్యాచ్ లో  Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ 123 కొట్టింది. దానిలో K.సైదులు అనే ప్లేయర్ హాఫ్ సెంచరీ చేయడంతో తనని మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ప్రకటించి అతనిచే "బంగారం" సాంగ్ ను రిలీజ్ చేయించింది చిత్రబృందం.
 
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ సినిమా బాగా మీకు నచ్చుతుంది. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికి థాంక్యూ సో మ్యాచ్. మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు నాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. అబ్బాయిలకు మ్యాచ్ పెట్టారు, మరి అమ్మాయిలకు సంబంధించి ఏమున్నాయి అంటే...  
 
దీనికి బన్నీవాసు స్పందించి....ఈ సాంగ్ ను రీల్ గా చేసి గీతా ఆర్ట్స్ ను ట్యాగ్ చేస్తే, సెలెక్ట్ అయినా 10 మందికి వాళ్ళ ఫ్యామిలీ కి ఈ సినిమాను చూపించి. వాళ్ళను పుష్ప షూటింగ్ కి కూడా తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు.