గురువారం, 23 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 22 నవంబరు 2022 (23:03 IST)

ఊహతో విడాకులా.. అవన్నీ రూమర్సే.. శ్రీకాంత్ వెల్లడి (video)

Srikanth, ooha, Rohan, Roshan, Medha
సినీ తారలు ఊహ, శ్రీకాంత్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు.. హీరో శ్రీకాంత్. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. 
 
ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మకండని తెలిపారు. గతంలో తాను చనిపోయినట్లుగా ఒకసారి పుకారు పుట్టించారని.. ఆ వార్త కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశారని చెప్పారు. తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నామని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వెల్లడించారు. 
 
హీరో శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ప్రస్తుతం తానూ ఊహ అరుణాచలేశ్వరం వెళ్తున్నామని చెప్పారు. 
 
నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న ఛానల్స్‌పై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానంటూ హీరో శ్రీకాంత్ లేఖలో తెలిపారు.