సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 8 జనవరి 2019 (15:40 IST)

పూరీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్ లేటెస్ట్ అప్‌డేట్..!

ఎనర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాధ్ - ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి టూరింగ్ టాకీస్ - పూరి క‌నెక్ట్ బ్యాన‌ర్స్ పైన రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెలాఖ‌రున సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. రామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయ‌నున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ & టైటిల్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
ఈ మూవీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పూరి - మ‌ణిశ‌ర్మ క‌లిసి ఐదు సినిమాల‌కు వ‌ర్క్ చేసారు. కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్‌ని తీసుకుందాం అనుకుంటే ఈ మ‌ధ్య కొంతమందికి మాత్ర‌మే క్వాలిటీ మ్యూజిక్ ఇస్తున్నాడు. మిగ‌తా వారి సినిమాల‌ను అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అందుచేత దేవిశ్రీని వ‌ద్ద‌నుకున్నార‌ట‌. అనూప్ ఈమ‌ధ్య వెన‌క‌బ‌డిపోయాడు. అందుచేత‌ మ‌ణిశ‌ర్మ‌ను ఎంచుకున్నార‌ట‌. అదీ..సంగ‌తి.!