సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:04 IST)

ఎపిసోడ్‌కు వెయ్యి.. కంటికి గాయం.. పెళ్లి ఆగిపోయింది.. జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన రెమ్యునరేషన్ ఒక ఎపిసోడ్‌కు వెయ్యి రూపాయలని జబర్దస్త్ వినోద్ తెలిపాడు. తాజాగా వినోద్ మాత్రం తన రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
 
తన పనేదో తాను చేసుకుని వెళ్లడమే తప్పించి.. మిగతా టీమ్ సభ్యుల రెమ్యునరేషన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు తనకు అందుతున్న రెమ్యునరేషన్ గురించి మాత్రం వినోద్ ఏమీ చెప్పలేదు. 
 
టీమ్ సభ్యుల రెమ్యునరేషన్‌ను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారని చెప్పాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ తెలిపాడు. 
 
ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ ఇంటి కొనుగోలు వ్యవహారంలో యజమాని చేతిలో తీవ్ర గాయాలపాలైన తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వినోద్ తెలిపాడు. ఆరోగ్యం కుదుటపడేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పాడు. 
 
కంటిపై బలమైన గాయం కావడంతో.. కోలుకోవడానికి మరింత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్టు తెలిపాడు. త్వరలోనే తిరిగి మేకప్ వేసుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానని ధీమాగా చెప్పాడు. కానీ కంటిపై దాడి జరగడంతో తన పెళ్లి ఆగిపోయిందని వినోద్ వెల్లడించాడు.