ఆ ఇద్దరు దర్శకులే నన్ను సంతృప్తి పరిచారు.. అనసూయ

Anchor Anasuya
జె| Last Modified బుధవారం, 26 జూన్ 2019 (20:10 IST)
బుల్లితెరపై జబర్దస్త్ షో హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి ఎపిసోడ్‌ను తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. అసలు జబర్దస్త్ షో వచ్చిందంటే చాలు టీవీల ముందు అతుక్కుని పోతుంటారు మహిళలు. మొదట్లో షో బాగానే ఉన్నా ఆ తరువాత జుగుప్సాకరమైన డైలాగ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఉండడంతో చూసే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది.

కానీ క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. యాంకర్ అనసూయకు జబర్దస్త్ మంచి పేరునే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జబర్దస్త్ ఇంతటి విజయాన్ని సాధించడానికి ఇద్దరే కారణమంటోంది అనసూయ. వారే దర్సకులు నితిన్, భరత్‌లు. ఇద్దరూ కలిసికట్టుగా ఈ షోను నడిపించారు. ప్రతి ఎపిసోడ్‌ను కష్టపడి తీస్తున్నారు. ఈ షో విజయానికి కారణం వీరే.

ఈ షోలో నాకు ఇంతటి పేరు రావడం సంతోషంగాను, సంతృప్తినిస్తోందని చెబుతోంది అనసూయ. నాకు ఈ ఇద్దరు దర్సకుల వల్లే సంతృప్తి కలుగుతోంది అంటోంది అనసూయ. ఐదు సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా జబర్దస్త్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అనసూయ.దీనిపై మరింత చదవండి :