బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2025 (14:43 IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. లంగా వోణీలో.. లడ్డూను టేస్ట్ చేస్తూ....? (video)

Jhanvi Kapoor
Jhanvi Kapoor
బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్‌లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. తాజాగా శనివారం  జాన్వీ వెంకన్నను దర్శించుకుంది. 
 
కొత్త ఏడాది సందర్భంగా స్నేహితుడు శిఖర్‌ పహారియాతో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఆలయానికి చేరుకున్న జాన్వీ కపూర్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 
Jhanvi Kapoor
Jhanvi Kapoor
 
అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం సందర్భంగా జాన్వీ కపూర్‌ సంప్రదాయ లంగాఓనీలో ఎంతో అందంగా కనిపించింది. నూతన సంవత్సరం 2025 సందర్భంగా, జాన్వీ కపూర్ తిరుమల ఆలయాన్ని సందర్శించి, తన గెస్ట్ హౌస్ నుండి ఫోటోలను పంచుకున్నారు.
Jhanvi Kapoor
Jhanvi Kapoor
 
నీలం, ఊదా రంగుల లంగా వోణి దుస్తులు ధరించి డైమండ్ నెక్లెస్ ధరించి సాధారణ సౌత్ ఇండియన్ అమ్మాయిలా కనిపించింది. ఆమె ఫోటోలకు "నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ వీడియోను ఆమె నెట్టింట షేర్ చేసింది. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.