మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (09:24 IST)

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

Ram Charan at Mysore
Ram Charan at Mysore
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ప్రమోషన్ లు చేస్తూనే మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మైసూర్ లో తాజా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పాల్గొననున్నారు. మంగళవారంనాడు ఆయన షూట్ లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా, ఈ తాజా సినిమా కూడా రాజకీయనేపథ్యంలో వుంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ గత కొద్దిరోజులుగా మైసూర్ లో చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో సమాచారం మేరకు తర్వాత చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.