బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (10:12 IST)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

srileela
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం డిసెంబరు 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా 'పుష్ప-2' చిత్రం ఓ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అలాగే, ఆదివారం కిస్సిక్ పేరుతో ఓ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసింది. పుష్ప-1 తొలి భాగంలో హీరోయిన్ సమంత నటించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసింది. ఇపుడు పుష్ప-2లో ఈ కిస్సిక్ అనే ఐటమ్ సాంగ్‌ను యువ హీరోయిన్ శ్రీలీలపై చిత్రీకరించారు. 
 
ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. సుబ్లాషిణి ఆలపించారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లో నాలుగు మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నెంబర్ వన్ పోజిషన్‌కు చేరింది. కాగా పుష్ప-2 చిత్రం డిసెంబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే.