మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (15:43 IST)

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

garikapati
ఎరచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా ఎలా చూపిస్తూరంటూ గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతుంది. పుష్ప సినిమా విడుదలైన కొత్తల్లో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయగా, అపుడు వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ఫాన్స్‌ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా మరోమారు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్ అవుతుంది. 
 
గతంలో గరికపాటి మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి.. చివరలో మంచిగా చూపిస్తాం, తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారని, ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం‌ చెడిపొవాలా? అని ప్రశ్నించారు.
 
అలాగే, స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి తగ్గేదే లే‌ అంటాడా? ఇప్పుడు అదొక ఉపనిషత్ సూక్తి అయిపోయిందన్నారు. ఈ చిత్ర హీరో దర్శకుడు తనకు సమాధానం చెప్తే కడిగిపాడేస్తానని గరికపాటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. తగ్గేదే లే అంటున్నాడని, ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గేదే లే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదంటూ గరికపాటి ఈ వీడియోలో మాట్లాడారు. వచ్చే నెల ఐదో తేదీన పుష్ప-2 చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరల్ కావడం గమనార్హం.