గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (20:05 IST)

ధోనీ-సాక్షితో జాన్వీ కపూర్.. నెట్టింట ఫోటో వైరల్

Janhvi Kapoor
Janhvi Kapoor
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత ఏడాది జనవరి 19వ తేదీన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక జరిగింది. 
 
ఇక వీరిద్దరికీ జూలై 12వ తేదీ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్‌లో మార్చి 1న ప్రారంభమై మార్చి 3వ తేదీన ముగిశాయి. 
 
జామ్ నగర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బ్రావో తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు తమ ఫోటోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనీ దంపతులతో జాన్వీ కపూర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.