శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (19:18 IST)

ధోనీ హుక్కా తాగుతున్న వీడియో వైరల్

Dhoni
Dhoni
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. సచిన్ టెండూల్కర్ తర్వాత, భారతదేశానికి చెందిన ఏ క్రికెటర్ అయినా ఇంత పాపులారిటీ సంపాదించుకోలేదనే చెప్పాలి. రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్, మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఇతనే. 
 
తాజాగా రెండు రోజుల క్రితం ధోని షీషా అని కూడా పిలువబడే హుక్కా తాగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వెలువడింది. ఈ వీడియో చూసి చాలామంది షాక్ అయ్యారు. 
 
తన సెమీ-రిటైర్డ్ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ధోని.. ఎంచక్కా రాష్ట్రాలు తిరిగేస్తున్నాడు.  ఈవెంట్‌లకు హాజరవుతున్నాడు. తాజాగా ధోనీని స్మోకింగ్ అవతారంలో చూడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. 
 
తాజాగా స్మార్ట్ వాచ్ కోసం రాపర్‌తో కలిసి పని చేశాడు ధోనీ. ఈ సందర్భంగా ధోని పొగలు ఊదుతూ కనిపించిన వీడియో విడుదలైంది. అయితే, షీషాపై ధోనికి ఉన్న అభిమానం కొత్తేమీ కాదు. 2018లో, చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోని హుక్కాను ఎంచుకున్నాడు.