శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (12:14 IST)

వైకాపాకు బైబై చెప్పేసిన అంబటి రాయుడు

Ambati Rayudu
Ambati Rayudu
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైకాపాలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి బైబై చెప్పేశారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన ప్రకటన త్వరలో చేస్తానంటూ ట్వీట్ చేశారు. 
 
గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. 

భారత క్రికెటర్‌ అయిన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్‌కి దూరమయ్యాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి వుందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు.. గత ఏడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ  చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం వైసీపీ తరపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.