ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా తీర్థం పుచ్చుకోనున్న అంబటి రాయుడు? సీఎం జగన్‌తో భేటీ!

ambati rayudu
అన్ని క్రికెట్ ఫార్మెట్లకు గుడ్‌బై చెప్పిన భారత క్రికెట్ జట్టు క్రికెటర్ అంబటి రాయుడు ఏపీలోని అధికార వైకాపాలో చేరనున్నారు. ఇదే అంశంపై ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం జగన్‌ను కలుసుకున్నారు. రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్కీ పెద్దలు కూడా పాల్గొన్నారు. 
 
ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న ట్రోఫీని వారు సీఎం జగన్‌కు చూపించారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. ఈ క్రమంలో చెన్నై ఆటగాళ్ళ సంతకాలతో కూడిన జెర్సీని రుపా గురునాథ్, అంబటి రాయుడులు సీఎం జగన్‌కు అందజేశారు. 
 
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ, ఏపీలో క్రీడారంగం అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్టు సీఎం జగన్‌కు సూచించారు. క్రీడల అభివృద్ధికి తగిన సూచనలు స్వీకరిస్తామని, ఈ మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.