ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఫైన్ విధించిన పోలీసులకు చుక్కలు చూపిన విద్యుత్ శాఖ లైన్‌మెన్

eblineman
విధి నిర్వహణలో భాగంగా రౌండ్స్ తిరుగుతున్న విద్యుత్ శాఖ లైన్‌మెన్‌ ఒకరు హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు రూ.1000 అపరాధం విధించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ లైన్‌మెన్ పోలీసులకు తన పవరేంటో చూపించాడు. పోలీస్ స్టేషన్‌తో పాటు పోలీస్ నివాస గృహాలకు కరెంట్ సరఫరా చేసే విద్యుత్ వైర్లలను కట్ చేశాడు. దీంతో కరెంట్ లేక నానా అవస్థలు పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని మీరట్‌కు చెందిన ఖలీద్ అనే ఈబీ ఉద్యోగి... విధి నిర్వహణలో భాగంగా హాపూర్‌కు బైక్‌పై వచ్చాడు. అయితే, అతడు హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.1000 అపరాధం విధించారు. తాను విద్యుత్ ఉద్యోగినని, విధి నిర్వహణపై వచ్చానని చెప్పినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. చట్టం ముందు అందరూ సమానమేనంటూ రూ.వెయ్యి అపరాధం విధించారు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ఖలీద్ స్థానికంగా కరెంట్ సరఫరా నిలిపివేశాడు. అసలే ఎండల్లో తల్లడిల్లిపోతున్న వారికి కరెంట్ లేకపవోడంతో జిల్లా ఎస్పీతో సహా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఖలీద్ కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే, ఈ వ్యవహారంపై ఇటు పోలీసు శాఖ, అటు విద్యుత్ శాఖ అధికారులు స్పందించలేదు.