ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (15:10 IST)

నా ముందు అన్నయ్య అని పిలిచేది.. ఇది హనీ ట్రాప్: జానీ మాస్టర్ భార్య

Jani Master
Jani Master
కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారని.. ఇది తప్పుడు కేసు అని, జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్‌లో ఫేమస్ అయ్యాడని, అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ జానీ మాస్టర్ సతీమణి అయేషా ఆరోపిస్తోంది. అసలు ఆ అమ్మాయికి ట్యాలెంట్ ఉందనే ఉద్దేశ్యంతోనే జానీ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ అవకాశం ఇచ్చినట్లు చెప్పింది.
 
స్టేజి డ్యాన్సులు చేసుకునే అమ్మాయికి అవ‌కాశం ఇస్తే ఇప్పుడు ఆయనపైనే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంది. 16 ఏళ్లకే అత్యాచారం జ‌రిగింది అంటున్నారు. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఆమె ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్ల‌లేద‌ని ఆధారం ఉందా.. ఆ అమ్మాయికి చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్‌ ఉన్నాయి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అయేషా. 
 
ఇంకా అయేషా మాట్లాడుతూ.. "నా ముందు అన్నయ్య అని పిలిచేది.. బయటికి వెళ్లాక పెళ్లి చేసుకోమని అడిగేది. పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసింది.. మతం కూడా మార్చుకుంటానని చెప్పింది. జానీ మాస్టర్ చేసిన తప్పు అదే.. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి.. అంటూ అయేషా మండిపడింది. 
 
ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదని.. ఒకటి ఆ అమ్మాయే ఇష్టమై నడుచుకుని వుండాలి. లేకుంటే ఇది తప్పుడు ఆరోపణలు అయి వుండాలి. హోటల్స్ బుక్ చేయడం అనేవి.. అవుట్ డోర్స్ వెళ్లినప్పుడు సాధారణంగాడ జరిగే విషయమే. మరి సినిమా షూటింగ్‌లకు వెళ్లేటప్పుడు హోటల్స్ లోనే బస చేయాలి కాబట్టి. కొరియోగ్రాఫర్లను రోడ్లపై పడుకోబెడతారా.." అంటూ ప్రశ్నించింది. 
 
అలాగని ఎన్నో సార్లు బలాత్కారం చేశాడని చెప్పిన ఆ అమ్మాయి ఇన్నాళ్లు ఎందుకు మిన్నకుండిపోయింది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జానీని తను బ్లాక్ మెయిల్ చేసేదని, ఆమె వేధింపులు తెలిసి తాను ఆత్మహత్యాయత్నం చేశానని అయేషా వెల్లడించింది.
 
ఆమె వేధింపులు భరించలేక ఆమె ఇంటికెళ్లి మందలించాను.. ఇంకా కొట్టబోయాను.. అంటూ అయేషా చెప్పింది. ఇదంతా హనీ ట్రాప్ అని, జానీ మాస్టర్‌పై ఆమెవి ఆరోపణలే కానీ నిజం కాదని అయేషా స్పష్టం చేసింది. 
 
ఇండస్ట్రీలో కొంతమంది జానీకి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించింది. పుష్ప 2 సినిమా పెద్దల ప్రమేయంతోనే ఈ కుట్ర జరిగిందని.. ఈ కుట్రలో చాలామంది భాగస్వాములుగా వున్నారని ఫైర్ అయ్యింది.