గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:13 IST)

కాలయముడిగా మారిన కట్టుకున్న మొగుడు.. కెనడా వరుడు.. ఇలా.?

Woman
Woman
కట్టుకున్న మొగుడు.. కాలయముడిగా మారిపోయాడు. పారాణి ఆరక ముందు భర్త చేతిలో హతమైంది కొత్త పెళ్లి కూతురు. 24 రోజుల క్రితం పెళ్లి కూతురిగా వెళ్లింది. అట్టహాసంగా ఆ పెళ్లి కూతురి వివాహం జరిగింది. ఆమె జీవితం బాగుండాలని భారీగా పెట్టి పోతలు పెట్టి అత్తారింటికి సాగనంపాడు. కానీ ఆమెను భర్త హతమార్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బర్నాలాలోని నారాయణగఢ్ సోహియాన్ గ్రామంలో భార్య మెడపై పదునైన వస్తువుతో కొట్టి హత్య చేశాడు భర్త. జస్‌ప్రీత్ కౌర్‌ పేరెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
భారీగా కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినా.. ఆమె ఉన్నత చదువులు చదవాలనుకుంది. కెనడా వీసా కూడా ఉంది. జనవరిలో కెనడా వెళ్లాల్సి ఉంది. ఇదే విషయం భర్తకు కూడా చెప్పింది. కానీ అతడు ఒప్పుకోలేదని టాక్. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 
 
దీంతో ఆమెపై కోపంతో పదునైన వస్తువుతో కొట్టడంతో చనిపోయిందని చెబుతున్నారు జస్‌ప్రీత్ కౌర్‌ కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.