శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

rajababu
ప్రముఖ సినీ నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం మరణించినట్టు ఆమె వెల్లడించారు. 
 
"నా అన్నయ్య రాజబాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3.26 గంటలకు (గురువారం) హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటాం" అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.