శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మే 2024 (16:16 IST)

ఈ తరానికి తెలియాలనే జయహో రామానుజ రూపొందించాను : డా. సాయి వెంకట్

Dr. Sai Venkat, Joe Sharma
Dr. Sai Venkat, Joe Sharma
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జయహో రామానుజ'. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'జయహో రామానుజ' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.
 
Jayaho Ramanuja  trailer event
Jayaho Ramanuja trailer event
శ్రీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ - దేవుడి ముందు అందరూ సమానమేననే గొప్ప సందేశాన్ని మానవాళికి అందించిన గురువు శ్రీ రామానుజాచార్యుల వారు. కుల, మత బేధం లేకుండా మనుషులంతా ఒక్కటేనని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరం పాటించాలి. ఆ శ్రీ రామానుజాచార్యుల వారి అనుమతితోనే జయహో రామానుజ సినిమాను సాయి వెంకట్ రూపొందించాడని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ప్రయత్నాలు జరగాలి. మానవాళి బాగుండాలని కోరుకుంటూ సాయి వెంకట్ కు నా తరుపు ఆశీస్సులు అందజేస్తున్నాను. అన్నారు.
 
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. పదేళ్ల క్రితమే ఈ సినిమాకు అంకురార్పణ చేశాను. సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారితో పాటు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎవరు రామానుజాచార్యులు అని తెలియని వారు తెలుసుకోవడం ప్రారంభించారు. అన్నమయ్య సినిమా తర్వాతే ఆయన గురించి విస్తృతంగా అన్ని తరాల ప్రజలకు తెలిసింది. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. ఇవాళ మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం ఎందరో పెద్దలు నన్న ఆశీర్వదించేందుకు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.
 
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ - భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాలనేది నాన్నగారి కల. ఆ కలను సాకారం చేయడంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. నాన్నకు కృతజ్ఞతలు చెబుతున్నా. జయహో రామానుజ చిత్ర ట్రైలర్ లాంఛ్ కు ఎందరో పెద్దలు వచ్చి ఆశీర్వదించడం శుభసూచకంగా భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
ఇంకా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు రేలంగి నరసింహారావు, బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, నిర్మాత శోభారాణి, పొలిటికల్ లీడర్ వేణుగోపాలాచారి, నిర్మాత నటుడు గురురాజ్ మాట్లాదారు.