1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (16:23 IST)

కడుపులో కాలుతో తన్ని... సున్నిత భాగాలపై కొట్టాడు : ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్

Swati Maliwal
ఢల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేసి, చెంపపై ఏడు, ఎనిమిదిసార్లు కొట్టాడని, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ కోర్టులో చెప్పింది. ముఖ్యంగా, కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపై కొట్టాడని చెప్పారు. 
 
రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్‌పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జిరగింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభన్ కుమార్‌కు కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించిన విషయం తెల్సిందే. ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో సోమవారం బిభన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 
 
విచారణ జరుగుతుండగా కోర్టులో ఓ మహిళా న్యాయవాది కళ్లుతిరిగి పడిపోయారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రతకు స్పృహ కల్పోయినట్టు సమాచారు. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో బాధితురాలు స్వాతి మలీవాల్ కోర్టులోనే బోరున విలపించారు. విచారణ జరుగుతుండగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిని ఆపుకోలేక పోయారు. 
 
ఈ నెల 18వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేశారని, చెంపపై ఏడు ఎనిమిది సార్లు కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపైనా కొట్టాడని చెప్పారు దీంతో పోలీసులు ఈ నెల 18వ తేదీన బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.