బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (17:40 IST)

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

Directers Sujeeth and Sandeep, Kiran Abbavaram
Directers Sujeeth and Sandeep, Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా "క" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
 
ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు దర్శకద్వయం సుజీత్, సందీప్. "క" సినిమా తమకు మెమొరబుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చిందని వారు ఈ పోస్ట్ లో తెలిపారు. సుజీత్, సందీప్ స్పందిస్తూ - "క" సినిమా షూటింగ్ ఎక్సీపిరియన్స్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాం. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మారిపోయాం. అహర్నిశలు సినిమా కోసం పనిచేశాం. మేమంతా ఇష్టంతో పనిచేయడం వల్ల ప్రతి కష్టంలోనూ హ్యాపీగా ఫీలయ్యాం. "క" సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది. షూటింగ్ పూర్తయినందుకు బాధగా ఉన్నా, రేపు "క" సినిమా అందించబోయే విజయాలకు హ్యాపీగా ఎదురుచూస్తున్నాం. మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అని అన్నారు.
 
ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.  "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.
 
నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు