శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 మే 2016 (13:45 IST)

వర్మ ట్వీట్స్: ''కబాలి'' బాహుబలిలా వున్నాడే.. గబ్బర్ సింగ్ కావాలి బెగ్గర్ సింగ్ కాదు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్‌ల సెల్ఫీపై నోరు పారేసుకుని ఆపై ఫ్యాన్స్ తాకిడి నాలుక్కరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రిలీజైన రజనీకాంత్ కబాలి ట్రైలర్‌పై వర్మ స్పందించాడు.  కబాలి టీజర్‌లో కబాలీ బాహుబలిలా కనిపిస్తున్నాడని వర్మ వ్యాఖ్యానించాడు. 
 
రజనీకాంత్ వన్ అండ్ ఓన్లీ అంటూ ట్వీట్ చేశాడు. కబాలి సినిమాను తొలి రోజే నాలుగు సార్లు చూడాలనుకుంటున్నట్లు వర్మ ట్వీట్ చేయడంతో రజనీ కాంత్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే షారూఖ్, సల్మాన్ ఖాన్‌లను రజనీ కాంత్ బీట్ చేయలేరని చురకలంటించారు. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించిన దానిపై వర్మ ప్రతి స్పందించారు. ‘ఫ్లాప్‌ అయినా మాకు గబ్బర్‌సింగ్‌ కావాలి కానీ.. బెగ్గర్‌సింగ్‌ కాదు. సినిమాల్లో వార్నింగ్‌లు ఇచ్చి.. నిజజీవితంలో విన్నపాలు చేస్తే అర్థమేమిటి అంటూ ప్రశ్నించారు. విజ్ఞప్తి చేస్తే.. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా ఎలా వస్తుందని అడిగారు.