శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (15:58 IST)

వామ్మో.. 'కబాలి' వచ్చేస్తున్నాడు... రేస్ నుంచి మనం తప్పుకుందాం.. జడుసుకుంటున్న నిర్మాతలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం కబాలి చిత్రం ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. సోమవారమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని 22వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర నిర్మ

సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం కబాలి చిత్రం ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. సోమవారమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని 22వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించారు. దీంతో అనేక చిత్రాలు వాయిదా పడనున్నాయి.
 
మొన్నటి వరకు 'కబాలి' రిలీజ్‌పై క్లారిటీ లేకపోవడంతో పలు తెలుగు సినిమాలు జులై 22వ తేదీన విడుదల తేదీ ప్రకటించాయి. వాటిలో విక్టరీ వెంకటేష్ నటించిన 'బాబు బంగారం', అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు', గోపిచంద్ 'ఆక్సిజన్' వంటి బడా సినిమాలతోపాటు మరికొన్ని చిన్న చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.
 
వెంకీ, మారుతి కాంబినేషన్‌లో రూపొందిన 'బాబు బంగారం' షూటింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమయింది. అలాగే అల్లు శిరీష్, రెజీనా జంటగా అల్లు అరవింద్ నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు', గోపిచంద్, రాశీఖన్నా రెండోసారి జంటగా రానున్న 'ఆక్సిజన్' సినిమా కూడా ఈనెలలో రిలీజ్ చేయాలని భావించారు. 
 
కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' జులై 22న రావడం పక్కా అని తెలియడంతో ఒక్కొక్కరు వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే ఆడియో విడుదలను సైతం వాయిదా వేసి.. సింగిల్ ట్రాక్‌లను రిలీజ్ చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయా సినిమాల వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌‌ 'కబాలీ' జోష్‌తో ఊగిపోతోంది. ఈ ఊపు దేశ సరిహద్దులు దాటిపోయి పొరుగుదేశాలకు కూడా పాకింది. 'కబాలి' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ... రజినీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగిపోతోంది.