మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (13:48 IST)

బాక్సాఫీస్ షేకైపోతోంది... షాహిద్ కపూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

బాక్సాఫీస్ షేకైపోతోంది. అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ "కబీర్ సింగ్" ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఫలితంగా ఈ చిత్ర హీరో షాహిద్ కపూర్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
 
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు. ఈ చిత్రం జూన్ 21వ తేదీన విడుదల చేయగా, తొలి రోజునే రూ.12.21 కోట్లను కలెక్ట్ చేసింది.
 
అలాగే రెండో రోజైన శనివారం రూ.17.10 కోట్లు, మూడో రోజైన ఆదివారం రూ.17.84 కోట్లు చొప్పున కలెక్ట్ చేసింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. 
 
కాగా, ఈ చిత్రం మొదటివారంలో రూ.134.42 కోట్లను వసూలు చేసింది. వీకెండ్‌లో వసూలైన రూ.47.15 కలుపుకుని మొత్తం రూ.181.57 కోట్లను వసూలు చేసింది.