శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (09:29 IST)

దర్శకధీరుడు రాజమౌళి పిలిస్తే ఏమైనా చేస్తా : కాజల్ అగర్వాల్

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి పిలిస్తే ఏమైనా చేస్తానని, దేన్నైనా వదులుకుని వస్తానని నటి కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చిత్రంలో హీరోయిన్ చాన్స్ కొట్టేసి, రాకుమా

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి పిలిస్తే ఏమైనా చేస్తానని, దేన్నైనా వదులుకుని వస్తానని నటి కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చిత్రంలో హీరోయిన్ చాన్స్ కొట్టేసి, రాకుమారి అంటే కాజల్ అని నేటి తరం మనసులో గూడుకట్టుకుపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లో నటిస్తున్న సంగతితెలిసిందే.
 
రాజమౌళి నిర్మిస్తున్న 'బాహుబలి'లో ఎందుకు నటించడం లేదని ఆమె దగ్గర ప్రస్తావిస్తే, "అది రాజమౌళి సినిమా. తన చిత్రంలో ఏ పాత్రకు ఎవరు నప్పుతారో ఆయన వారిని మాత్రమే ఎంచుకుంటారు. బాహుబలిలో నటించనందుకు బాధపటడం లేదు. అయితే, 'బాహుబలి 3' ఉండి, అందులో నాకు ఓ అవకాశం ఇచ్చి పిలిస్తే, ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకుని పరుగు పెడతా. ఈ స్థాయి సినిమాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి, ఎక్కువ రావు" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్నానని, హిందీ చిత్రాలకు కొంత దూరంగానే ఉన్నానని అంటోంది.