బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (13:16 IST)

ప్రేమించుకున్నవారంతా పెళ్లిపీటలెక్కడం లేదు : కాజల్ అగర్వాల్

ప్రేమ విఫలంపై తన మనసులోని మాటను టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ వెల్లడించింది. ప్రేమలో విఫలమైతే బాధపడకూడదు అని చెపుతోంది. పైగా, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి పీటలెక్కడం లేదని గుర్తుచేశారు.

ప్రేమ విఫలంపై తన మనసులోని మాటను టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ వెల్లడించింది. ప్రేమలో విఫలమైతే బాధపడకూడదు అని చెపుతోంది. పైగా, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి పీటలెక్కడం లేదని గుర్తుచేశారు.
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రేమ విఫలంపై మాట్లాడుతూ, 'ఈ తరం యువత ప్రేమలో పడటం సర్వసాధారణంగా మారిందన్నారు. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధపడకూడదన్నారు. అది కరెక్ట్ కాదు. అలాంటి మానసికవేదన నుంచి బయటపడాలన్నారు. ప్రేమించడం… ప్రేమించబడటం సహజం. ప్రేమించుకున్న వాళ్లందరూ పెళ్లి పీటలెక్కడం లేదన్నారు. 
 
ప్రేమలో పడడంలాగే ప్రేమలో విఫలమవడం కూడా సాధారణ విషయమే అని చెప్పారు. ప్రేమలో పడ్డా కూడా మనం ఏమిటన్నది మరచిపోకూడదు… మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. మన ప్రాధాన్యతను ప్రేమ తగ్గించకూడదు. ప్రేమించిన వ్యక్తే జీవితం అనే స్థాయికి వెళ్లరాదు. ఒక వేళ ప్రేమలో విఫలమైనా అందుకు బాధపడకూడదు. దాని నుంచి వెంటనే బయటపడవచ్చు' అని కాజల్ అంటోంది. అయితే, ఇది తన వ్యక్తిగత అనుభవమో ఏమోకానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పింది.