శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (17:12 IST)

బాలకృష్ణ 'జైసింహా' సెన్సార్ టాక్ ఇదే!

యవరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైసింహా. ఈచిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జైసింహాకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యా

యవరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైసింహా. ఈచిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జైసింహాకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ నిర్మాత. బాలయ్యకు జోడీగా నయనతార, హరిప్రియ నటించారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. సినిమాలో మాస్ డైలాగ్స్‌కు కొదవలేదట. యాక్షన్ సీన్స్ అదిరిపోతున్నాయట. బాలయ్య, నయనతారల మధ్య సెంటిమెంట్ సీన్లు, క్లైమాక్స్ మనసును టచ్ చేసేలా ఉన్నాయట. 
 
చిరంతన్ భట్ మ్యూజిక్, థీమ్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉన్నాయట. సి.కల్యాణ్ చెప్పినట్టు ఓ పాటలో బాలయ్య డ్యాన్స్ అదిపోయిందట. జనవరి 12వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. గత యేడాది కూడా బాలకృష్ణ నటించి గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కూడా సంక్రాంతికి ఇదే తేదీన రిలీజ్ అయిన విషయం తెల్సిందే.