సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 23 జనవరి 2018 (18:37 IST)

శరీరమనేది క్షణభంగుర స్వప్నం

జాతి-లక్షణ-దేశాలతో విభజనకాని, సమానంగా ఉండే వస్తువుల సైతం వేరువేరు అనే జ్ఞానంపై సంయమం వల్ల కలుగుతుంది. మన దుఃఖాలు-అజ్ఞానం, యుక్తాయుక్త వివేక జ్ఞానం లేకపోవడం వల్ల కలుగుతున్నాయి. అయోగ్యాన్ని యోగ్యంగా, స్వప్నాన్ని యధార్ధంగా, మనం భావిస్తున్నాం. ఆత్మ మాత్ర

జాతి-లక్షణ-దేశాలతో విభజనకాని, సమానంగా ఉండే వస్తువుల సైతం వేరువేరు అనే జ్ఞానంపై సంయమం వల్ల కలుగుతుంది. మన దుఃఖాలు-అజ్ఞానం, యుక్తాయుక్త వివేక జ్ఞానం లేకపోవడం వల్ల కలుగుతున్నాయి. అయోగ్యాన్ని యోగ్యంగా, స్వప్నాన్ని యధార్ధంగా, మనం భావిస్తున్నాం. ఆత్మ మాత్రమే నిత్యం. ఈ విషయాన్ని మనం మరిచిపోయాం. శరీరమనేది క్షణభంగుర స్వప్నం. ఐనా మనం దేహమే అని భ్రాంతి పొందుతున్నాము. ఇలాంటి అవివేకమే - అజ్ఞానమే  దుఃఖాలకు పుట్టినిల్లు. వివేకం మనకు బలాన్ని ఇస్తుంది. అప్పుడే మనం ఈ శరీరాలను స్వర్గాలను-దేవతలను ఒక్కసారిగా త్రోసివేస్తాం.
 
జాతి లక్షణ దేశాలతో వస్తువులను విభజించడం వలనే ఈ జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణకు ఒక ఆవుని తీసుకుందాం. జాతి వల్ల ఆవు-కుక్క వేరు వేరని తెలుసుకుంటాం. మరి ఆవుల్లోనే ఒక ఆవు మరొక ఆవు వేరువేరు అని ఎలా నిర్ణయిస్తాం. లక్షణం వల్ల. రెండు వస్తువులు సరగ్గా ఒకే విధంగా ఉంటే అవి వేరు-వేరు చోట్ల ఉండడం వల్ల వాటిని విభజించి తెలుసుకుంటాం. ఈ భేదాలు కూడా మనకు తోడ్పడలేనంత అవిభాజ్యంగా వస్తువులు కలిసిపోయి ఉంటే పైసంయమం వల్ల వాటిని విభజించటానికి సమర్దులమవుతాం. 
 
పురుషుడు-పరిశుద్ధుడు-పరిపూర్ణుడు జగత్తులో ఒక పురుషుడే కేవలుడు అని చెప్పే సిద్ధాంతమే మహత్తర యోగతత్త్వానికంతా మూలాధారం. మన శరీరాలు ప్రకృతి పురుషుల సంయోగం వల్ల కలిగియున్న మనం మనస్సుతో శరీరంతో తాదాత్మ్యం పొందుతుంటాం. ప్రకృతి వేరు-పురుషుడు వేరు అనే వివేకం లేకపోవడమే గొప్ప ప్రమాదం. ఇలాంటి వివేచన శక్తి కలిగినవెంటనే మనస్సంబందమైన-శారీర సంబంధమైనదైన ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా సంయోగజనితం అని ఆ కారణంగా అది పురుషతత్వం కానేరదని గ్రహిస్తాం.