మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (11:25 IST)

డబ్బు ఎంత శక్తివంతమైనది.. ఎలా చేస్తే డబ్బు నిలబడుతుంది...

డబ్బు చాలా శక్తివంతమైనది. ఎక్కడ ధనముంటే అక్కడ సౌఖ్యాలు, సౌభాగ్యాలు, వసతులు అన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుత సమాజంలో ధనం కోసం కొన్ని మోసాలు, ఇతరులను బాధపెట్టడం, మోసగించడం, ఇతరుల సొమ్ముకు ఆశపడటం ఇలాంటివి అన్

డబ్బు చాలా శక్తివంతమైనది. ఎక్కడ ధనముంటే అక్కడ సౌఖ్యాలు, సౌభాగ్యాలు, వసతులు అన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుత సమాజంలో ధనం కోసం కొన్ని మోసాలు, ఇతరులను బాధపెట్టడం, మోసగించడం, ఇతరుల సొమ్ముకు ఆశపడటం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. ధర్మబద్ధంగా మనం సంపాదించే ధనాన్ని అదేవిధంగా పొదుపు చేసుకోవాలి. 
 
ఆర్థిక అవసరాలు, జీవితం ముందుకు సాగాలంటే, ఒకరి దగ్గర మనం అవమానాలకు గురి కాకుండా ఉండాలంటే మన దగ్గర ధనం ఉండాలి. ధనం ఉండాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదిస్తే ధనం నిలబడదు. కాబట్టి ధనం నిలబడాలి అంటే ధర్మపరంగా, న్యాయంగా సంపాదించాలి. మోసం అసలు చేయకూడదు. అక్రమ మార్గంలో సంపాదించకూడదు. 
 
సంపాదించిన డబ్బులో కొంత భగవంతుడికి, కొంత పేదప్రజలకు కనీసం ఒక శాతం ఇస్తే సంపాదించిన డబ్బు నిలబడుతుంది. అందుకే ధనం చాలా శక్తివంతమైనదని పెద్దలు చెబుతుంటారు.