శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:47 IST)

ప్రేమికుల రోజు స్పెషల్ - 'కళావతి' సాంగ్ - నేడు ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సర్కారువారి పాట". మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, ఎంబీజీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే నెలలో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రంలోని పాటల్లో 'కళావతి' సాంగ్‌ను ఈ నెల 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. 
 
థమన్ సంగీతం సమకూర్చగా, సిధ్ శ్రీరామ్ గానం చేశారు. థమన్ ముందుగా చెప్పినట్టుగానే ఈ పాట అదిరిపోయేలా ఉంది. ప్రోమో సాంగే అద్భుతంగా వుంది. ప్రేమపాటగా తెరకెక్కించగా, ప్రేమికులను మరో లోకంలో వివహించేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక ప్రోమలో మహేష్ లుక్స్, కీర్తి సురేష్ లుక్స్ హైలెట్‌గా నిలిచాయి. 
 
తెలుపు రంగు టీ షర్టులో అల్ట్రా స్టైలిష్ లుక్‌‍తో మహేష్ బాబు అదిరిపోయేలా ఉన్నారు. ఇక కీర్తి సురేష్ అందం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "ఒక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు కిందకు దూకాయో.. ఏంటో ఈ మాయ అంటూ కీర్తి అందాన్ని పొగుడుతూ ప్రేమ పరవశంలో హీరో మునిగి మెలికలు తిరుగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ పాట ప్రోమో నెట్టింట వైరల్‌గా ఉంది.