సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:30 IST)

మరో సరికొత్త ప్రయోగం చేస్తున్న కళ్యాణ్ రామ్ తాజా అప్ డేట్

Kalyan Ram
Kalyan Ram
సినిమా సినిమాకు భిన్నమైన కథతో ప్రయోగాలు చేసే నందమూరి కళ్యాణ్ రామ్, బింబిసార, అమిగోస్, డెవిల్ వంటి సినిమాలతో సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. బింబిసార మినహా మిగిలినవి పెద్దగా ఆదరణ పొందలేదు. అయినా తాను వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటున్నారు. 
 
తాజాగా మరో సినిమా చేస్తున్నారు. గత అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా నేడు హైదరాబాద్ లోని అమీర్షూ పేటలో షూటింగ్ జరుపుకుంటుంది. మాళవిక మోహన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా వుటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అశోక ఆర్ట్స్ బేనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సునీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముప్పవరపు వెంకయ్య చౌదరి, అశోక్ నిర్మాతలు.