శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (10:57 IST)

దేవర గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

Deva action shot
Deva action shot
ఎన్.టి.ఆర్ జూనియర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం దేవర. సముద్ర నేపథ్యంలో మత్స్యకారుల జీవితాలతో కథ జరగడంతో యాక్షన్ సీన్స్ ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది. ఇందుకు హాలీవుడ్ తోపాటు బాలీవుడ్ యాక్షన్ మాస్టర్లను కూడా పెట్టి షూట్ చేశారు. అందులో ఓ యాక్షన్ సీన్ ను దేవర టీమ్ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. దానికితోడు.  5 ఏప్రిల్ 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో లార్డ్ ఆఫ్ ఫియర్ అంటూ తెలియజేసింది.
 
Tseris devara
Tseris devara
ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుతో దాదాపు 33  కోట్లకు టీ సీరియస్ సొంతం చేసుకుందనే ట్రేడ్  వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.  ఇందులో జాన్వీ కపూర్ నాయికగా నటిస్తోంది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా వుంటుందనే టాక్ కూడా వుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.