ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (16:27 IST)

దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ ప్రకటించిన కొరటాల శివ

Devara latest
Devara latest
ఎన్.టి.ఆర్. జూనియర్ తో దర్శకుడు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఒక్కో అప్ డేట్ సందర్భానుసారంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా, నేడు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, ది లార్డ్ ఆఫ్ ఫియర్ 10.10.24న అంటూ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.
 
సునామీని విప్పుతున్నాడు అంటూ మరో కాప్షన్ ను కూడా జోడించి సినిమా పై అంచాలకు తెరలేపింది. సముద్రదొంగల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ హైలైట్ కానున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా వుండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ తదితరులు నటిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.