ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: గురువారం, 24 నవంబరు 2022 (09:20 IST)

అస్వస్థతకు లోనైన హీరో కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక డిశ్చార్జ్

kamal - viswanath
విశ్వనటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వచ్చిన తర్వాత ఆయన జ్వరం వచ్చింది. దీంతో చెన్నై పోరూరులో ఉన్న శ్రీ రామచంద్ర వైద్య ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గురువారం ఉదయం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. రెండు రోజులు పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.
 
ఇదిలావుంటే, తన కొత్త చిత్రం 'ఇండియన్-2' షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కమల్ హాసన్. లెజండరీ దర్శకుడు, 'కళాతపస్వి' కె.విశ్వనాథ్‌ను బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి వెళ్లిన కమల్... కళాతపస్వి ఆశీర్వాదాలు తీసుకన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని, ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "గురువుగారిని వారింట్లో కలిశాని, ఎన్నో మధుర స్మృతులను గుర్తు చేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవం'' అని పేర్కొన్నారు.