మంగళవారం, 31 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (13:07 IST)

మూడేళ్ళుగా క‌త్తిప‌ట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal Aggarwal, Kalaripayattu Martial Ar
Kajal Aggarwal, Kalaripayattu Martial Ar
కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌త్తిప‌ట్టింది. యుద్ధ క‌ళ‌ల‌లో ఓ భాగ‌మైన విద్య‌ను నేర్చుకుంటోంది. ఇందుకోసం మూడేళ్ళుగా అప్పుడ‌ప్పుడు చేస్తోంది. అయితే ఈసారి సీరియ‌స్‌గా ఆమె నేర్చుకున్న విద్య‌ను వెండితెర‌పై చూపించే అవ‌కాశం వ‌చ్చింది. ఇండియ‌న్‌2 సినిమాకోసం ఈ విద్య నేర్చుకుంది. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. దీనిలో భాగంగా ఇంత‌కుముందు గుర్ర‌పు స్వారీ కూడా నేర్చుకుంది. ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. బిడ్డ‌కు జ‌న్మ ఇచ్చిన త‌ర్వాత కాజ‌ల్ ఇలా ఫిట్ వుంటూ నాయిక‌గా న‌టించేందుకు చెమ‌ట‌లు క‌క్కుతుంది.
 
Kajal Aggarwal, Kalaripayattu Martial Ar
Kajal Aggarwal, Kalaripayattu Martial Ar
కలరిపయట్టు అనేది పురాతన భారతీయ యుద్ధ కళ, ఇది 'యుద్ధభూమి కళలలో అభ్యాసంస‌గా చేస్తోంది.  ఈ కళారూపం మాయాజాలం షావోలిన్, కుంగ్ ఫూ,  కరాటే మరియు టైక్వాండో మొదలైన వాటి పుట్టుకగా పరిణామం చెందింది. కలరి సాధారణంగా గెరిల్లా యుద్ధానికి ఉపయోగించబడింది మరియు ఇది సాధకుడికి శారీరకంగా మరియు మానసికంగా శక్తినిచ్చే ఒక అందమైన అభ్యాసం. 3 సంవత్సరాలుగా దీన్ని అడపాదడపా నేర్చుకుంటున్నందుకు హృదయపూర్వకంగా  కృతజ్ఞతలు తెలియ‌జేసింది కాజ‌ల్‌. దీనివ‌ల్ల త‌న శ‌క్తిసామ‌ర్థ్యాలు పెరిగాయ‌ని చెబుతోంది. త్వ‌ర‌లో ఇండియ‌న్‌2 చిత్రం కోసం తాను ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు చెబుతోంది.