ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2022 (15:41 IST)

ఉఫ్... గుర్రం ఎక్కలేకపోతున్నానంటున్న కాజల్ అగర్వాల్

Kajal Aggarwal
ఇండియన్ 2 కాంట్రాక్ట్‌పై సంతకం చేయడంతో కాజల్ గర్భం దాల్చిందని, ఆ సినిమా నుంచి కాజల్‌ను తొలగించారని సమాచారం. కాజల్ అగర్వాల్ ఆ కామెంట్లను పక్కనపడేస్తూ కూల్‌గా కమల్‌హాసన్‌తో కలిసి నటించేందుకు కన్ఫర్మ్ చేసింది. కాజల్ అగర్వాల్ సినిమా కోసం గుర్రానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది

 
బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ నటించేందుకు రావడం ఆనందంగా ఉందంది. తన శరీరం మునుపటిలా లేదు. పాత శక్తిని శరీరంలోకి తీసుకురావడం కష్టం అంటుంది. శరీరం మారవచ్చు. కానీ ఆసక్తి ఎప్పుడూ మారదని మనం గ్రహించాలని చెప్పింది. అయితే, భారతీయుడు 2లో మళ్లీ నటించడం ఆనందంగా ఉందని తన పునరాగమనాన్ని ధృవీకరించింది