శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (11:27 IST)

ఇండియ‌న్‌2 లేటెస్ట్ అప్‌డేట్ సంద‌ర్భంగా క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌దా క‌బుర్లు

kamal laest still
kamal laest still
క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్ సినిమా అంటే భార‌తీయుడు గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమా భార‌తీయ చ‌ల‌న‌చిత్ర‌రంగాన్ని కుదిపేసింది. భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ త‌ర్వాత మ‌ర‌లా వీరి కాంబినేష‌న్‌లో సీక్వెల్ వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌ధ్య‌లో కొన్ని అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా విక్ర‌మ్ సినిమా క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన చిత్రం బాక్సీఫీస్‌ను షేక్ చేసేసింది. దాంతో క‌మ‌ల్‌కు పూర్తి ధైర్యం రావ‌డం, అంత‌కుముందు శంక‌ర్‌తో వున్న చిన్న‌పాటి స్ప‌ర్థ‌లు తీరిపోవ‌డం జ‌రిగింది.
 
kamal and producer
kamal and producer
అయితే, మంగ‌ళ‌వారంనాడు ఇండియ‌న్‌2 (భార‌తీయుడు2) చిత్రం షూటింగ్ షురూ అయిందని తెలుస్తోంది. చెన్నైలో ఓ స్టూడియోలో నిర్మాత‌ల‌ను క‌మ‌ల్‌హాస‌న్ క‌లిసి మాట్లాడ‌డం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇండియ‌న్‌2 అధికారిక సోష‌ల్‌మీడియాలో - కమల్ సార్  ఇండియన్2 లుక్ ఇదంటూ చూపించారు. మీసాలు తిప్పి ప‌సుపు చొక్కాతో అంద‌రినీ ప‌లుక‌రిస్తూ, 70లో మీరు ఎలా క‌నిపించేవారో అంటూ వారితో స‌ర‌దాగా మాట్లాడిన విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఈరోజు నుండి షూటింగ్ పునఃప్రారంభం అంటూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు ప్రారంభ‌మైన ఈ సినిమా షూట్‌లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ పార్ట్ షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ద‌ర్శ‌కుడు శంకర్  RC15 షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.