ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:30 IST)

తండ్రి కోసం స్కెచ్‌ వేస్తున్న కుమార్తె.. యువ హీరోలకు ఎర..?

తండ్రి కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో కుమార్తె శృతి హాసన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన తండ్రి ప్రజా సేవ వైపు నడవడం, మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటానని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతానని

తండ్రి కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో కుమార్తె శృతి హాసన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన తండ్రి ప్రజా సేవ వైపు నడవడం, మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటానని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతానని ప్రకటించడంతో శృతి హాసన్‌కు తండ్రిపై అపారమైన గౌరవం పెరిగింది. దీంతో కమల్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట శృతి హాసన్. అంతటితో ఆగలేదు రాజకీయంగానే కాదు. మీరు వేసే ప్రతి అడుగులో సలహాలను నేను ఇస్తూ, మీ వెంట నేనుంటా నాన్నా అంటూ మాట ఇచ్చిందట. 
 
తన కుమార్తె సంతోషాన్ని చూసిన కమల్ హాసన్ నీ సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకుంటానమ్మా. తర్వాత కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశారట. ఇప్పుడు శృతి తన స్నేహితులను కలిసి నా తండ్రికి నేనే సలహాలు ఇస్తున్నానంటూ తెగ ఆనందపడుతూ చెప్పేస్తోందట. రాజకీయాలకు ఇద్దరూ కొత్తే అయినా వీరు ఎలాంటి సలహాలు, సూచనలు చెప్పుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. 
 
అయితే శృతిహాసన్ మాత్రం తనకు తెలిసిన సినీప్రముఖులను కమల్ హాసన్ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేస్తోందట. అందులో మొదటి వ్యక్తి విశాల్. ఇప్పటికే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తమిళ సినీపరిశ్రమలో ప్రచారం జరిగింది. ఇలా తమిళ సినీపరిశ్రమలో పేరున్న యువ హీరోలను కమల్ చెంత చేర్చేందుకు శృతి స్కెచ్ వేస్తోందట.